రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అపహరణకు గురైన మేకలు దొంగలను పట్టించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఇదే నిజం.. మే.. మే.. అని అరిచే మేకలే కదా అని చులకనగా చూసి వాటిని అపహరించిన దొంగల ఆటను ఆ మేకలే కట్టించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లలో అపహరణకు గురైన మూడు రోజుల తర్వాత ఓ మార్కెట్లో తమ యజమానిని గుర్తించి పరుగులు…