మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు.
Ex Wife and Husband contesting in Bishnupur: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ వారంలోనే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరుపున బెంగాల్ నుంచి పోటీ చేస్తున్న వారి పేర్లను తాజాగా సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. టీఎంసీ 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కొన్నిస్థానాల్లో అభ్యర్థుల ఎంపిక…
Manipur:మణిపూర్‌లో ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా వీరందరిని హత్య చేసినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో తండ్రీ, అతని కొడుకు కూడా ఉన్నారు. చురచంద్ పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య కొండల్లో మిలిటెంట్లు నలుగురు గ్రామస్తులను కిడ్నా్ప్ చేశారు. శీతాకాలం కావడంతో మంట కోసం కట్టెలు తీసుకువచ్చేందుకు సమీప అడవుల్లోకి వెళ్లిన సమయంలో వారిని అపహరించారు. వీరందర్ని మిలిటెంట్లు చంపినట్లుగా ఈ రోజు పోలీసులు వెల్లడించారు.
Manipur Violence Latest Updates: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని మరోసారి కాల్పులు జరిగాయి. బిష్ణుపూర్ జిల్లాలో బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ కమ్యూనిటీ మధ్య జరిగింది. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులుఅదృశ్యం అయ్యారు. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ నిర్వహించాయి. ఈ కాల్పుల వల్ల 100 మందికి పైగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు…
Manipur Violence: మణిపూర్‌లో మూడు నెలలుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మెయిటీ, కుకీ కమ్యూనిటీల ప్రజలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. బిష్ణుపూర్‌లో అర్థరాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారనే వార్త వెలుగులోకి వచ్చింది.