ప్రస్తుతం అనసూయ అన్న పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై వ్యాఖ్యాతగా అనసూయ మురిపించిన వైనం- వెండితెరపై రంగమ్మత్తగా ఆమె వెలిగిపోయిన తీరు నవతరం ప్రేక్షకులను కట్టిపడేసింది. పట్టుదలే ఉంటే అనుకున్నది సాధించవచ్చు అన్నది అనసూయను చూస్తే అర్థమవుతుందని ఇటీవలే ఆమె సహ వ్యాఖ్యాతలే వ్యాఖ్యానించడం విశేషం. అనసూయ కెరీర్ ను చూస్తే అది నిజమనిపించక మానదు. అనుకోకుండానే…అనసూయ…ఎప్పుడో 2003లో జూ.యన్టీఆర్ ‘నాగ’లో కాసేపు తెరపై తళుక్కుమన్న అనసూయ, తరువాతి రోజుల్లో ఇంతలా ఆకట్టుకుంటుందని ఆ నాడు ఎవరూ…