శుక్రవారం ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీని కారణంగా, ఈ విమానం తిరుగు ప్రయాణాన్ని ఎయిర్‌లైన్ రద్దు చేయాల్సి వచ్చింది. మార్గమధ్యలో పక్షి విమానాన్ని ఢీకొట్టిన విషయం పైలట్‌కు కూడా తెలియకపోవడం గమనార్హం. అయితే, పూణేలో ల్యాండింగ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో సంస్థ విమానం తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ బృందం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోందని ఎయిర్ ఇండియా తెలిపింది.…
Telangana Aviation Director : అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని అపోహలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయని ఆయన అన్నారు. విమాన సాంకేతికత, భద్రతా ప్రమాణాల గురించి స్పష్టత ఇవ్వడం కోసం ఆయన పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. భరత్ రెడ్డి మాటల ప్రకారం, ఒక ఇంజన్ ఆగిపోతే మరొకటి పని చేస్తుందన్న భావన సరికాదని…