హెలికాప్టర్ ప్రమాదంపై ఎగతాళి వ్యాఖ్యలుచైనా కనీస మానవత్వం మరిచిపోయి మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. సంయమనంతో స్పందించాల్సిన సందర్భంలో అవాకులు చెవాకులు పేలింది. చీఫ్‌ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్‌రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం పై చైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. భారత సైన్యానికి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత లేదని వ్యాఖ్యానించింది. భారత సైన్యం ఆధునికీకరణకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించింది. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ మీడియా సంస్థ…
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ పటం వద్ద నివాళులర్పించిన కేంద్ర రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి ఎం.ఎం. పల్లం రాజు మీడియాతో మాట్లాడారు. భారత దేశం చాలా క్రిటికల్ జంక్షన్‌లో ఉందన్నారు. ఇప్పటి వరకు మనకు ప్రత్యర్థి పాకిస్తాన్‌ను సరిహద్దులో ఎదుర్కొంటూ వచ్చాం. గత రెండేళ్లుగా చైనా మన సరిహద్దులో తన ఆధిపత్యం కోసం చాల దూకుడుగా వ్యవహరిస్తూ పాగా వేసిందన్నారు. సరిహద్దు సమస్య పరిష్కారం కానంత వరకు…
డిసెంబరు 8 బుధవారం తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన చాపర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది సైనికులు మరణించారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు దేశం మొత్తం సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తోంది. రావత్ వీరమరణానికి చిత్రసీమ కూడా సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేసింది. మోహన్‌లాల్, చిరంజీవి, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి దక్షిణాది ప్రముఖులు…