దేశపు తొలి సీడీఎస్ బిపిన్ రావత్ఈయన హఠాన్మరణంతో సీడీఎస్ కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది.తమిళనాడులో జరిగిన ఘోర హెలీకాప్టర్ ప్రమాదంలో భారత ఆర్మీలో అత్యున్నత అధికారి ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఉన్న జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది దుర్మరణం పాలైన సంగతి తెల్సిందే. దీంతో సీడీఎస్ స్థానం ఖాళీ అయింది. దేశ రక్షణ విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే ఈ ఖాళీని భర్తీ చేసింది. బిపిన్ రావత్ స్థానంలో…
తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.రూ. 50లక్షలు అందించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మరణించిన సంగతి తెల్సిందే.. వీరితో పాటు మృతిచెందిన సైనికుల మృతదేహాలను గుర్తుపట్టేందుకు ఆర్మీ అధికారులు డీఎన్‌ఏ టెస్టులు చేసి…
హెలికాప్టర్ ప్రమాదంపై ఎగతాళి వ్యాఖ్యలుచైనా కనీస మానవత్వం మరిచిపోయి మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. సంయమనంతో స్పందించాల్సిన సందర్భంలో అవాకులు చెవాకులు పేలింది. చీఫ్‌ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్‌రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం పై చైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. భారత సైన్యానికి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత లేదని వ్యాఖ్యానించింది. భారత సైన్యం ఆధునికీకరణకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించింది. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ మీడియా సంస్థ…
సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇటీవల హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్‌తోపాటు సాయితేజ దుర్మరణం పాలైన విషయం తెల్సిందే.. చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని లేఖలో తెలిపారు. సాయి తేజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. కేవలం తొమ్మిదేళ్ల సర్వీసులో త్రివిధ దళాదిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే…
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ పటం వద్ద నివాళులర్పించిన కేంద్ర రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి ఎం.ఎం. పల్లం రాజు మీడియాతో మాట్లాడారు. భారత దేశం చాలా క్రిటికల్ జంక్షన్‌లో ఉందన్నారు. ఇప్పటి వరకు మనకు ప్రత్యర్థి పాకిస్తాన్‌ను సరిహద్దులో ఎదుర్కొంటూ వచ్చాం. గత రెండేళ్లుగా చైనా మన సరిహద్దులో తన ఆధిపత్యం కోసం చాల దూకుడుగా వ్యవహరిస్తూ పాగా వేసిందన్నారు. సరిహద్దు సమస్య పరిష్కారం కానంత వరకు…
హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బీపిన్ రావత్‌కు రాష్ర్ట బీజేపీ నేతలు బీజేపీ కార్యాలయంలో నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో వివేక్, ఇంద్రాసేనారెడ్డి, డీకే అరుణ ఉన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. బిపిన్ రావత్ గొప్ప దేశభక్తుడని అన్నారు. ఆయన మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. దేశం ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరమని ఆమె తెలిపారు. టెర్రరిస్టులను ఎదుర్కొవడంలో ఆయన అనుసరించే వ్యూహాలు ప్రత్యర్థులకు సైతం అందవని కొనియాడారు. దేశానికి ఆయన…
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న చాపర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చెన్నై,ఢిల్లీ ఇంటెలిజెన్స్ అధికారులు చేరుకుని వివిధ అంశాలు పరిశీలిస్తున్నారు. ఆకాశమార్గంలో రెండు రూట్స్ వున్నా ఎందుకు ఇదే మార్గం బిపిన్ రావత్ బృందం ఎంచుకుందనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చాపర్ లో ఎందుకు ప్రయాణం చేసారన్న కోణం లో అధికారుల ఆరా తీస్తున్నారు. సుల్లూరు క్యాంపు నుండి వెల్లింగ్టన్ క్యాంపు రోడ్…
సీడీఎస్ బిపిన్ రావత్ మరణం యావత్ దేశానికే తీరని లోటని మాజీ కేంద్ర రక్షణ సహాయశాఖ మంత్రి పల్లం రాజు అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. బిపిన్ రావత్ మరణం పై స్పందించారు. నాకు సీడీఎస్ రావత్‌తో మంచి అనుబంధం ఉంది. త్రివిధ దళాల అధిపతిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎన్నో పతకాలు సాధించారన్నారు. చాపర్ ప్రమాదం పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయని, కానీ దర్యాప్తులోనే నిజాలు తెలుస్తాయని ఆయన అన్నారు. విజబులిటి సరిగా…
తమిళనాడు రాష్ట్రంలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయి… బిపిన్ రావత్ దంపతులతో సహా మొత్తం 13 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం పై… లోక్ సభలో… కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. సుల్లూరు ఎయిర్ బేస్ నుంచి నిన్న.. ఉదయం 11:48 గంటలకు హెలి కాప్టర్ టేకాఫ్ అయిందన్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు వెల్లింగ్టన్ లో ల్యాండ్ కావాల్సి ఉందని…