తమిళ నాడు రాష్ట్రంలో నిన్న చోటు చేసుకున్న హెలి కాప్టర్ ప్రమాదంలో… ఏకంగా.. 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించడం విషాదకరం. అయితే.. ఈ ఘటన లో ఐఏఎఫ్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయట పడ్డారు. ఆయన తీవ్ర గాయాలతో ప్రస్తుతం మిలటరీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. మృత్యువు తో పోరాడుతున్న వరుణ్ సింగ్.. ఈ ఏడాదే శౌర్య చక్ర అవార్డు…
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చాపర్ ఎలా కూలింది, కారణాలేంటి అనేది అన్వేషణ కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా విషాదం నింపిన హెలికాప్టర్ ప్రమాదానికి పొగమంచే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడురోజుల నుంచి ఈ మార్గంలో ట్రయల్ రన్ నడుస్తోంది. సంజప్పన్ క్షత్తిరం గ్రామంలో కాలిపోతూ కుప్పకూలింది మిలటరీ హెలికాప్టర్. బుధవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాతేరీ పార్క్ లో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి ప్రాంతంలో సాధారణంగా పొగమంచు ఎక్కువగా వుంటుంది. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాసేపట్లో వెల్లింగ్…
కుప్పకూలిన హెలికాప్టర్ వద్ద వింగ్ కమాండర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో బ్లాక్ బాక్స్ సెర్చింగ్ కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ కోసం నిపుణుల బృందం అన్వేషణ కొనసాగిస్తోంది. బ్లాక్ బాక్స్ కోసం కాటేరు పార్క్ లో జల్లెడ పట్టనున్నారు వెల్లింగ్టన్ మిలటరీ క్యాంప్ అధికారులు.ఆ ప్రాంతానికి ఎన్టీవీ టీం వెళ్ళింది. అన్వేషణ జరుగుతున్న తీరుని పరిశీలించింది. ఏదైనా విమాన ప్రమాదం జరిగితే… అది ఎలా జరిగిందో వివరాలు బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసే అవకాశాలు ఉంటాయి. అది పైలెట్ల సంభాషణలను…
తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, ఆర్మీ అధికారులకు సంతాపం వ్యక్తం చేశారు బండి సంజయ్. మాతృభూమి రక్షణ కోసం రావత్ చేసిన సేవలు ఎనలేనివన్నారు బండి సంజయ్. రావత్ మరణం దేశానికి తీరని లోటన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు…
Mi-17 V5 హెలికాఫ్టర్ కు అనేక ప్రత్యేకతలు వున్నాయి. ఇది చాలా అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్. టెక్నాలజీ పరంగా కూడా ఎలాంటి కొరత ఉండదు. ఇలాంటి ఉన్నతాధికారులు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో భద్రతా చర్యలు తీసుకుంటారు. ఏ రూట్ లో అయితే ట్రావెల్ చేయాలో… ఏ పైలెట్ అయితే వెళ్తాడో ముందుగానే అక్కడికి వెళ్లి ల్యాండ్ చేసి… కంప్లీట్ రిపోర్ట్ ఇస్తాడంటున్నారు రిటైర్డ్ మేజర్ భరత్. ట్రయల్ ల్యాండింగ్ మస్ట్ గా చేస్తారు. కేటగిరి బీ పైలెట్స్…
తమిళనాడులోని కూనూరు వద్ద ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టన్ కుప్పకూలింది. ప్రమాదం సమయంలో సీడీయస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణీతో పాటు మరో 7గురు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కేంద్ర కేబినేట్ ఎమర్జెన్సీ సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ ఘటనపై ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాసేపట్లో ఈ ప్రమాదంపై రాజ్‌నాథ్ సింగ్ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా…