సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న చాపర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చెన్నై,ఢిల్లీ ఇంటెలిజెన్స్ అధికారులు చేరుకుని వివిధ అంశాలు పరిశీలిస్తున్నారు. ఆకాశమార్గంలో రెండు రూట్స్ వున్నా ఎందుకు ఇదే మార్గం బిపిన్ రావత్ బృందం ఎంచుకుందనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చాపర్ లో ఎందుకు ప్రయాణం చేసారన్న కోణం లో అధికారుల ఆరా తీస్తున్నారు.
సుల్లూరు క్యాంపు నుండి వెల్లింగ్టన్ క్యాంపు రోడ్ మార్గం లో వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు ఎయిర్ ఫోర్స్ ప్రోటో కాల్ అధికారులు. కాన్వాయ్‌తో పాటు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ సిద్దం చేశారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. అయితే చివరి పదినిమిషాల్లో ప్లాన్ మారిపోయింది. చాపర్ లో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రమాదానికి గురైంది చాపర్. 13 మంది ప్రాణాలు కోల్పోయారు.