తమిళనాడు రాష్ట్రంలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయి… బిపిన్ రావత్ దంపతులతో సహా మొత్తం 13 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం పై… లోక్ సభలో… కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. సుల్లూరు ఎయిర్ బేస్ నుంచి నిన్న.. ఉదయం 11:48 గంటలకు హెలి కాప్టర్ టేకాఫ్ అయిందన్నారు.
మధ్యాహ్నం 12:15 గంటలకు వెల్లింగ్టన్ లో ల్యాండ్ కావాల్సి ఉందని ఆయన తెలిపారు. కానీ మధ్యాహ్నం 12:08 గంటలకు సుల్లూరు ఏటీపీ విమానానికి కాంటాక్ట్ తెగిపోయిందని రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ఈ ప్రమాద ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు అని ఆవేదన వ్యక్తం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. హెలికాప్టర్ కూలిపోవడాన్ని అక్కడే ఉన్న స్థానికులు గమనించారని.. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైందనీ ప్రకటించారు రాజ్ నాథ్ సింగ్.