హాలీవుడ్ హీరో, ర్యాపర్ విల్ స్మిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అలాద్దీన్’ చిత్రంతో తెలుగువారికి విల్ స్మిత్ సుపరిచితుడే.. తెలుగులో డబ్బింగ్ అయినా ఈ చిత్రంలో విల్ స్మిత్ క్యారెక్టర్ కి వెంకటేష్ డబ్బింగ్ చెప్పాడు. ప్రస్తుతం పలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఆయన ఇటీవల ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.తన 16 ఏళ్ల వయసులో మొదటి బ్రేకప్ ని రుచి చుశానని తన చేదు జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు “నా 16…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత నెల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఇంకా కన్నడిగులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పునీత్ బయోపిక్ శాండల్ వుడ్ లో చర్చానీయాంశంగా మారింది. తాజాగా పునీత్ కి భారీ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ సంతోష్ కి ఒక అభిమాని తన మనసులో మాట చెప్పాడు. ట్విట్టర్ ద్వారా ఆ అభిమాని ” సార్.. అప్పు(పునీత్)…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. దానితో పాటే తమిళ సినిమా ‘కర్ణన్’ రీమేక్ లోనూ నటించబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించాడు. ఇది కాకుండా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ నూ చేయబోతున్నట్టు తెలిపాడు. దీనిని అతని తండ్రి బెల్లంకొండ సురేశ్ నిర్మించబోతున్నారు. రెండు రోజుల ముందు రవితేజ సైతం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో తానూ తగ్గేది లే అంటున్నాడు సాయి శ్రీనివాస్. దీపావళి…
ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. మరో మాజీ క్రికెటర్ బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నట్లు బీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. యువరాజ్ సింగ్ నిజజీవితాన్ని ఆధారంగా ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సిద్ధమయైనట్లు తెలుస్తోంది. దీనిపై యువరాజ్‌తో సంప్రదింపులు కూడా జరిపాడని సమాచారం. కరణ్ ప్రతిపాదనకు యువీ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని బీటౌన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే యువీ ప్రతిపాదించిన ఇద్దరు స్టార్ హీరోలను…
ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. అందులోనూ స్పోర్ట్ స్టార్స్ బయోపిక్ లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన ఇండియన్ క్రికెటర్స్ లో బయోపిక్స్ గా తెరకెక్కింది మాత్రం ఇద్దరివే. ఒకరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాగా మరొకరు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ. ఇక 1983లో వరల్డ్ కప్ సాధించిన ఇండియా విక్టరీని 83 పేరుతో సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమా విడుదల కోవిడ్ కారణంగా వాయిదా…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘తలైవి’. పురచ్చి తలైవి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో విబ్రి మీడియా, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు జూన్ 22న పూర్తయ్యాయి. తాజాగా హిందీ వర్షన్ సెన్సార్ సైతం పూర్తయింది. తమిళంలో…
బాలీవుడ్ బయోపిక్స్ ట్రెండ్ లో మరో స్పోర్ట్స్ డ్రామా యాడ్ కాబోతోంది. భారత్ తరుఫున వింటర్ ఒలంపిక్స్ లో ఆరుసార్లు పాల్గొన్న అథ్లెట్ శివ కేశవన్ జీవిత కథ తెరకెక్కనుంది. హిమాచల్ లోని మనాలీలో పుట్టిన శివ కేశవన్ ‘ల్యూజ్’ అనే మంచు క్రీడలో ఇండియా తరుఫున పాల్గొన్న మొదటి క్రీడాకారుడు. అంతే కాదు మొత్తం ఆరుసార్లు ఆయన దేశానికి ప్రాతినిధ్యం వహించగా అందులో రెండు సార్లు… 1998, 2002 వింటర్ ఒలంపిక్స్ లో… ఒకే ఒక్కడుగా…
1951సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రథమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమికోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞం గా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యముతో ఈ సినిమా…
బాలీవుడ్ లో బయోపిక్స్ జోరు కొనసాగుతోంది. క్రికెటర్స్ మొదలు సైంటిస్టుల దాకా అందరి జీవిత కథలు తెరకెక్కించేస్తున్నారు. దర్శకనిర్మాతల ఉత్సాహానికి తగ్గట్టే బాలీవుడ్ స్టార్స్ కూడా బయోపిక్స్ లో ఛాన్స్ వస్తే అస్సలు వదలటం లేదు. ఆమీర్, అక్షయ్ లాంటి హీరోలు, కంగనా, విద్యా బాలన్ లాంటి హీరోయిన్స్ అందరూ చకచకా బయోపిక్స్ చేసేస్తున్నారు. మరి బయటి రంగాల్లోని ప్రముఖుల జీవితాల్ని తెరకెక్కిస్తోన్న బాలీవుడ్ తమ స్వంత లెజెండ్స్ ని పక్కన పెడుతుందా? లేట్ లేడీ కొరియోగ్రాఫర్…
ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతాక విజేత, మాజీ బాక్సర్ డింగ్కో సింగ్ (42) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. కాలేయ క్యాన్సర్‌తో ఆయన 2017 నుంచి పోరాడుతున్నారు. మణిపూర్‌కు చెందిన డింగ్కో సింగ్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంతాపం తెలిపారు. బాక్సింగ్ కోసం డింగ్కో సింగ్ చేసిన కృషికిగాను కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం…