2023 నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేసి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆయన చేసిన కృషికి ఫలితంగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్నాడు.నేడు (డిసెంబర్ 7) రేవంత్ రెడ్డిముఖ్యమంత్రిగా…
శ్రీలంక లెజెండరీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు,టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘800’.ఈ మూవీకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన ఈ మూవీ స్క్రిప్ట్ ను రాశారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేశారు. శ్రీలంకలో ఈ సినిమా…
దివ్య భారతి.. ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ గురించి తెలియని వారు లేరు. తక్కువ ఏజ్ లో నే ఈమె హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాధించింది. మూడు సంవత్సరాలలో స్టార్ హీరోల సరసన 20 సినిమాలకు పైగా నటించి మెప్పించింది. 90వ దశకంలో దివ్య భారతి ఇండస్ట్రీ ని ఊపేసింది.ఆ రోజుల్లో ఈ భామ కుర్రాళ్లకు ఆరాధ్య దేవత.ఆమె అందానికి నటనకు అన్నిభాషల్లో స్టార్ మేకర్స్ ఎంతో ఫిదా అయ్యారు స్టార్ హీరోలు కూడా దివ్య…
ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా '800' పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 5న ముంబైలో రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హాజరవుతున్నారు.
సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ పెరుగుతోంది. సినీ నటీనటుల జీవితాలపై తెరకెక్కే సినిమాలకు గిరాకీ పెరిగింది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లో చాలా బయోపింక్ చిత్రాలు వచ్చాయి.
అటల్ బిహారీ వాజపేయి నిష్కళంక దేశభక్తుడే కాదు… ప్రధానిగా దేశానికి సేవ చేసిన గొప్ప రాజకీయనాయకులు. 1924 డిసెంబర్ 24న గ్వాలియర్ లోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వాజపేయి గ్వాలియర్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. యుక్తవయసులో ఆర్యసమాజ్ లో చేరిన వాజపేయి ఆ తర్వాత ఆర్.ఎస్.ఎస్. ప్రభావానికి లోనై ప్రచారక్ గా బాధ్యతలు స్వీకరించారు. పాత్రికేయునిగా విశేష సేవలు అందించిన ఆయన ఆ తర్వాత భారతీయ జనసంఘ్, బీజేపీ పార్టీలలో అతున్నత పదవులను అధిష్టించారు.…
కుల వ్యవస్థ నిర్మూలానికి కంకణం కట్టుకున్న భారత ప్రథమ సామాజిక తత్త్వవేత్త, ఉద్యమ కారుడు మహాత్మ జ్యోతిరావ్ పూలే. ఏప్రిల్ 11 సోమవారం ఆయన 195వ జయంతి సందర్భంగా హిందీలో బయోపిక్ ఒకటి రూపుదిద్దుకోబోతున్నట్టు ప్రకటన వచ్చింది. నాటక రంగం నుండి సినిమాల్లోకి వచ్చి ఆ పైన వెబ్ సీరిస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ గాంధీ… జ్యోతిరావ్ పూలే పాత్రను పోషించబోతున్నారు. ‘ఫులే’ పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ బయోపిక్ లో సావిత్రి బాయి పూలేగా జాతీయ…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఏది అనిపిస్తే అది అనేస్తాడు.. ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తాడు. ఇక రాజకీయ నేతల బయోపిక్ లు తీయడంలో వర్మ దిట్ట. బయటికి తెలియని ఎన్నో నిజాలను తన బయోపిక్ ల ద్వారా ప్రజలకు తెలియజేస్తాడు. ఇప్పటికే రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి, ఇక ఇటీవల కొండా లాంటి సినిమాలన్నీ బయోపిక్ లే.. ఇక ఈ సినిమాలను మొదలుపెట్టిన దగ్గరనుంచి…
ఇటీవల కాలంలో ఇండియన్ స్ర్కీన్ పై బయోపిక్ ట్రెండ్ బాగా నడుస్తోంది. బడా బడా స్టార్స్ కూడా బయోగ్రాఫికల్ డ్రామాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ధనుష్ కన్ను కూడా ఈ బయోపిక్స్ పై పడింది. రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ధనుష్ ఇప్పటి వరకు ఎవరి బయోపిక్‌లో నటించ లేదు. అవకాశం లభిస్తే తను కూడా బయోపిక్‌లలో నటిస్తానంటున్నాడు ధనుష్. ఇటీవల తన సినిమా ‘అత్రంగి రే’ ప్రచారంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు…
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్- దీపికా పదుకొనే జంటగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’83’. భారత మాజీ క్రికెటర్ 1983 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా హిందీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అనుకోకుండా బరిలోకి దిగి, ఊహించని విధంగా…