కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికించిన సంగతి అందరికీ తెలిసిందే. లక్షల మంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారి ఎలా పుట్టిందనే అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మనుషులకు ఎందుకు సోకింది అనే మూడేళ్లుగా సమాధానం లేని ప్రశ్నపై.. చైనాలో వుహాన్ నగరంలోని... వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఓ పరిశోధకుడు... ఆశ్చర్యకరమైన విషయాన్ని తెరపైకి తెచ్చారు.