Samsung Boss Gets Presidential Pardon: సామ్‌సంగ్ గ్రూప్ వారసుడు లీజే యాంగ్ కు విముక్తి లభించింది. ఆర్థిక అవినీతి, లంచం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ క్షమాభిక్ష పెట్టారు. ఆగస్టు 15 దక్షిణ కొరియా లిబరేషన్ డేను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శిక్ష అనుభవిస్తున్న 17 వందల మంది దోషులకు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది.