Bengaluru: ఇటీవల కాలంలో బైక్-ట్యాక్సీ రైడర్ల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. రాత్రి సమయాల్లో గమ్యస్థానం వెళ్లేందుకు బైక్స్, ఆటో, కార్లు బుక్ చేసుకుంటున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బెంగళూర్‌లో 28 ఏళ్ల మహిళపై ఓ ర్యాపిడో డ్రైవర్ అర్ధరాత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 5న రాత్రి 11.40 గంటల నుంచి అర్ధరాత్రి 12.00 గంటల మధ్య జరిగిందిన బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.