Mood of the Nation poll: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి ఘన విజయం సాధిస్తుందని సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 33-35 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఎన్డీయే ఓట్ల శాతం 47 నుంచి 52 శాతానికి పెరుగుతుందని అంచనా. బీహార్‌లో ఎన్డీయే తన పట్టును నిలుపుకుంటుందని చెప్పింది.
బీజేపీ వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నూతనోత్సాహం బీహార్‌లోనూ కొనసాగేలా కేడర్‌ను సిద్ధం చేస్తోంది.
Bihar: ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి నితీష్ కుమార్ సారథ్యం జేడీయూ-బీజేపీ-చిరాగ్ పాశ్వాన్ పార్టీలు కలిసి అధికారాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని అనుకుంటున్నాయి. అయితే, ఇలాంటి నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియా కూటమిలో తిరిగి చేరేందుకు నితీష్ కుమార్‌కి తలుపులు తెరిచే ఉన్నాయి’’ అని అన్నారు.
Nitish Kumar: 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే జరుగుతాయని ఎన్డీయే శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో నితీష్ కుమార్‌ని తమ నాయకుడిగా ప్రకటించే అవకాశం లేదని వస్తున్న ఊహాగానాలపై ఈ రోజు స్పష్టత వచ్చింది. బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు సమావేశమయ్యారు.