టెలివిజన్ చరిత్రలోనే అత్యధికంగా వీక్షించిన రియాల్టీ షోలలో బిగ్‌బాస్ తెలుగు కూడా ఒకటి. గత సంవత్సరం 15 వారాల పాటు జరిగిన సీజన్, తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంటినీ చేరువయింది. బిగ్‌బాస్ సీజన్ ముగిసిన వెంటనే తరువాత సీజన్ ఎప్పుడు ఆరంభమవుతుందోనంటూ ఆసక్తిగా ఎదురుచూస్తూ, చర్చలు చేస్తోన్న అభిమానులూ ఎంతో మంది ఉన్నారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ బిగ్ బాస్ సీజన్ 5 ప్రొమోను విడుదల చేసింది స్టార్ మా. షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోననే ఎదురుచూపులు……