గత పది రోజులుగా వెర్టిగో తో బాధపడుతున్నాడు జస్వంత్. అయితే పంటి బిగువున బాధను భరిస్తూనే, కొన్ని టాస్క్ లలో పాల్గొంటున్నాడు. ఇతర ఇంటి సభ్యుల సహకారంతో రోజులు నెట్టుకొస్తున్నాడు. వారం రోజులు దాటిపోయినా జెస్సీ ఆరోగ్యంలో మెరుగుదల లేకపోవడంతో నిన్న ప్రసారం చేసిన ఎపిసోడ్ లో ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ ను కూడా వీక్షకులకు బిగ్ బాస్ టీమ్ చూపించింది. అయితే.. ఇవాళ జెస్సీని బిగ్ బాస్ అనారోగ్య కారణంగా ఇంటి నుండి బయటకు…
ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం నామినేషన్స్ లో ఏకంగా ఎనిమిది సభ్యులు ఉన్నారు. ఇందులో ఆర్జే కాజల్, ప్రియ నామినేట్ కావడం ఇది మూడోసారి. కాజల్ వరుసగా మొదటి రెండు వారాలు నామినేట్ అయ్యి సేఫ్ గా బయటపడింది. ఇప్పుడు మూడోసారి నామినేషన్స్ లో ఉంది. ఇక ప్రియ రెండు, మూడు వారాలలో నామినేషన్ అయ్యి సేవ్ అయ్యింది. నాలుగోవారం మూడోసారి నామినేషన్స్ లో ఉంది. ఆమెకూ ప్రేక్షకుల నుండి…
సోమవారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చూసిన వాళ్ళందరికీ ఒక్కటే అనుమానం! ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తుండే లోబోకు ఏమైంది? అని. ఎందుకంటే… నామినేషన్స్ సమయంలో ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, మాటల దాడి చేయడం కామన్. కానీ హద్దు మీరి లోబో సోమవారం ప్రియను టార్గెట్ చేయడం, చిన్న విషయానికి ఆమెపైకి అరుస్తూ, కొట్టడానికే అన్నట్టుగా మీద మీదకు వెళ్ళడంతో చాలామందిని షాక్ కు గురిచేసింది. లోబో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక…
బిగ్ బాస్ సీజన్ 5 రసకందాయంలో పడింది. మూడోవారం హౌస్ లోంచి వరుసగా మూడో లేడీ కంటెస్టెంట్ గా లహరి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు హౌస్ లో కేవలం 16 మంది ఉన్నారు. అందులో నాలుగో వారానికి ఏకంగా ఎనిమిది మంది నామినేట్ కావడం విశేషం. ఇంతవరకూ ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంతమందిని నామినేట్ చేయడం ఇదే మొదటిసారి. ఆ ముగ్గురి మధ్య ఆసక్తికర చర్చ! లహరి బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు…
బిగ్ బాస్ సీజన్ 5 షో థర్డ్ ఎలిమినేషన్ వరకూ వచ్చేసింది. శనివారం హౌస్ సభ్యులను కలిసిన నాగార్జున కాస్తంత సీరియస్ గా ఉన్నాడు. దాంతో పార్టిసిపెంట్స్ సైతం కొంత కంగారు పడ్డారు. కొందరైతే నాగార్జునను అలా సీరియస్ లుక్ లో చూడలేక పోతున్నామన్నారు. చివరకు కాస్తంత మూడ్ మార్చుకుని నాగ్ మామూలు మనిషి అయ్యే ప్రయత్నం చేశాడు. శనివారం వేదిక మీదకు రావడంతోనే ‘హౌస్ లో అండర్ స్టాండింగ్ కన్నా… మిస్ అండర్ స్టాండింగ్ ఎక్కువైంద’ని…
బిగ్ బాస్ షో సీజన్ – 5, 16వ రోజున చక్కని వినోదానికి చోటు దక్కింది. ‘అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి’ అనే పేరుతో బిగ్ బాస్ ఓ పెళ్ళి చూపుల తతంగాన్ని కంటెస్టెంట్స్ అందరితో చేయించాడు. ఇందులో అమెరికా అబ్బాయిగా శ్రీరామ్, అతని తల్లిగా ప్రియా నటించగా, శ్రీరామ్ పీఏగా విశ్వ, స్నేహితుడిగా సన్ని నటించారు. కాజల్ అతని లవర్ గా నటించింది. ఇక లహరి హైదరాబాద్ కు చెందిన అమ్మాయి కాగా ఆమె తల్లిదండ్రులుగా…
బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ ఎలిమినేషన్ కు సంబంధించి వ్యూవర్స్ అంచనా కరెక్ట్ అయ్యింది. నటి ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఎలిమినేషన్ రౌండ్ లో లక్కీగా నటరాజ్ మాస్టర్ సేవ్ అయ్యాడు. ఈ రోజు డేంజర్ జోన్ లో ఉన్న నలుగురిలో మొదట ఆర్జే కాజల్ సేవ్ అయ్యింది. ఓ సినిమా పాటను ప్లే చేసి, అందులో ఎవరు పేరు ఉంటే…
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 పై సోషల్ మీడియాలోనూ, ఛానెల్స్ లోనూ ప్రతికూల వార్తలు జోరందుకుంటున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ షోపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు గేమ్ లో పూర్తిస్థాయిలో లీనమై పోయి, ఒకరి మీద ఒకరు దాడులు, ప్రతిదాడులూ చేసుకోవడం మొదలెట్టేశారు. ఆడ, మగ అనే తేడా లేకుండా, నియమ నిబంధనలను పాటించకుండా, అసభ్య పదజాలంతో మాటల యుద్ధాలకు…
“బిగ్ బాస్ 5″లో రచ్చ రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం, మంగళవారం ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ప్రత్యేకించి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిజ స్వరూపాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి. ఒక్కొక్కరుగా ముసుగు తొలగిస్తుండడంతో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. అసభ్యకర కామెంట్స్ కారణంగా నెటిజన్లు ఉమాదేవిపై, పొగరుగా బిహేవ్ చేసినందుకు శ్వేత వర్మపై కూడా ఫైర్ అయ్యారు. శ్వేత వర్మ లోబో ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ని విసిరి అతడిని ఫేక్ అని పిలిచింది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనీ…
“బిగ్ బాస్ 5” ప్రారంభమై 4 ఎపిసోడ్లు గడిచాయి. కంటెస్టెంట్స్ ఎవరి పెర్ఫార్మన్స్ లో వారు ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడంలో విఫలం అవుతున్నారు. లహరి వంటి కంటెస్టెంట్ల దూకుడును వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అయితే లహరి బిహేవియర్ ప్రేక్షకులను తెగ చిరాకు పెట్టేస్తోంది. ఆమె దాదాపుగా నోరు తెరిచిందంటే గొడవే. ఈ నాలుగు రోజుల ఎపిసోడ్ లో చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా ? అంటే.. ఒకటి ఏడుపు, రెండు గొడవలు. కంటెస్టెంట్స్ అందరిలో…