ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పును వెలువరించింది. సుప్రీం తీర్పుతో కేజ్రీవాల్ సర్కార్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.