ప్రజల్లో చైతన్యం పెంచడానికి వరల్డ్ డోనర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదాన కార్యక్రమాల్లో నలుగురు ఎమ్మెల్యేలు యాక్టివ్‌గా ఉన్నారన్న మంత్రి హరీష్ రావు.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 18 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారన్నారు. 1000 యూనిట్స్ తక్కువ కాకుండా అందించారని, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నో యూనిట్స్ బ్లడ్ అందించారన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి 7100 యూనిట్స్ రక్తాన్ని అందించారని,…
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు రెండో రోజు ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 11 యేండ్ల పాటు సైలెంట్‌గా ఉండి… ఇప్పుడు ఏదో నోటీసులు ఇచ్చారు.. తల్లి ఆపదలో ఉంటే అండగా ఉండాలి కొడుకు.. అలాంటి…
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్ లో తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ఆ పని చేసుకొచ్చి మీ ముఖం చూపియండంటూ ఆయన విమర్శలు గుప్పించారు.…
ప్రపంచీకరణతో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఇప్పుడే కాదు ఎల్లలు లేని కళలు ఏ నాడో సాగరాలు దాటి సందడి చేస్తున్నాయి. ఈ సమయంలో మరింతగా కళలు కళకళలాడే పరిస్థితి ఏర్పడింది. సకల కళలకు వేదికగా నిలచిన సినిమా రంగం ఉత్తర, దక్షిణ – తూర్పు, పడమర భేదాలను తుడిచివేయనుందని పరిశీలకులు ఘోషిస్తున్నారు. ప్రపంచ సినిమాను శాసించిన ‘హాలీవుడ్’ చూపు ప్రస్తుతం భారతదేశం వైపు సాగుతోంది. ఇప్పుదే కాదు, తమ కళలకు, కథలకు అనువైన వాతావరణం కోసం హాలీవుడ్ పలుమార్లు…
గత నెల మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్నట్లుగా 20 రోజులలోనే పదో తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. కానీ.. ఈ నెలాఖరు లోపు 10 వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే పేపర్ కరెక్షన్ పూర్తయ్యింది. ఇప్పుడు.. పోస్ట్ వాల్యూయేషన్ ప్రాసెస్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు..…
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఇటు రైతులు, అటు తెలంగాణ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతులు రుతుపవనాల కోసం ఎదురుచూస్తుంటే.. భానుడి భగ భగల నుంచి ఉపశమనం కోసం తెలంగాణ వాసులు ఎదురుచూస్తున్నారు. అయితే వీరి నిరీక్షణకు తెర దించే విధంగా సోమవారం సాయంత్రం తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తెలంగాణలోని మహబూబ్‌నగర్ వరకు విస్తరించిన రుతుపవనాలు మరో రెండు రోజుల్లో పూర్తిగా విస్తరిస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే..…
రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 7.04 శాతానికి తగ్గింది. ప్రధానంగా ఆహార ధరల తగ్గింపు కారణంగా ఇది వరుసగా ఐదవ నెలలో ఆర్బీఐ యొక్క ఎగువ టాలరెన్స్ స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ గణాంకాలు సోమవారం వెలువడ్డాయి. ఏప్రిల్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 7.79 శాతంగా ఉంది. మే 2021లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.3 శాతంగా ఉంది. అయితే.. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం, ఆహార…
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి 100కు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. క్రమంగా కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13,015 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 126 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 75 కేసులు వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో…
మియాపూర్ పీయస్ పరిధిలో ఆయుధాలతో పట్టుబడిన పాత నేరస్తులు పట్టబడ్డారు. అయితే ముగ్గురిని అరెస్ట్ చేయగా.. బీహార్‌కు చెందిన ఒకరు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక తపంచా, ఒక కంట్రీ మేడ్ పిస్టల్, రెండు మ్యాగ్జీన్ లు, 13 బుల్లెట్లు, ఒక బైక్, ఒక కారు, ఆరు మొబైల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. మాదాపూర్ డీసీపీ శిల్పవళ్లి మాట్లాడుతూ.. కొంతమంది వెపన్స్ తో మంజీరా పైప్ లైన్ రోడ్డు లో తిరుగుతున్నారనీ నిన్న ఉదయం 10 గంటలకు…
భారత భూగంలోకి అక్రమంగా ప్రవేశించి ఇద్దరు చైనీయులను సశాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ) అరెస్ట్ చేసింది. బీహార్‌లోని సీతామర్హి జిల్లాలోని భితామోర్ బోర్డర్ అవుట్‌పోస్ట్ నుంచి నేపాల్‌లోకి ఆదివారం సాయంత్రం అక్రమంగా ప్రవేశిస్తున్న చైనా జాతీయులు యుంగ్ హై లంగ్ (34), లో లంగ్ (28)ను తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఎస్బీ కమాండర్ రాజన్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. వారి వద్ద ఎలాంటి అధికార పత్రాలు లేకపోవడంతో భారత్‌లోకి అక్రమ ప్రవేశం, ఆర్థిక మోసాలకు సంబంధించి…