ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా భువీ రెకార్డుల్లోకెక్కాడు. సోమవారం (ఏప్రిల్ 7) వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ వికెట్ తీయడం ద్వారా భువీ ఖాతాలో ఈ రికార్డు చేరింది. భువనేశ్వర్ 179 ఐపీఎల్ మ్యాచ్‌లలో 184 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాడు.
మొన్నటివరకు ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా డ్వేన్ బ్రావో ఉన్నాడు. బ్రావో 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025లో మూడు మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్స్ తీశాడు, తద్వారా బ్రావోను వెనక్కినెట్టి అగ్రస్థానంలోకి వచ్చాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ మూడో స్థానంలో ఉన్నాడు. మలింగ 122 మ్యాచ్‌లలోనే 170 వికెట్స్ ఖాతాలో వేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా (165 వికెట్స్ – 134 మ్యాచ్‌లు), ఉమేష్ యాదవ్ (144 వికెట్స్ – 148 మ్యాచ్‌లు) టాప్ 5లో ఉన్నారు.
Also Read: Will Pucovski: ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సంచలన నిర్ణయం.. కెరీర్ మొదలు కాకముందే!
మొత్తంగా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు మాత్రం టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 163 మ్యాచ్‌ల్లో 206 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో పియూశ్ చావ్లా రెండో స్థానంలో ఉన్నాడు. 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు తీశాడు. ఆపై భువనేశ్వర్ కుమార్ (184 వికెట్స్ – 179 మ్యాచ్‌లు), డ్వేన్ బ్రావో (183 వికెట్స్ – 161 మ్యాచ్‌లు), రవిచంద్రన్ అశ్విన్ (183 వికెట్స్ – 216 మ్యాచ్‌లు) ఉన్నారు. ఐపీఎల్ 2025లో ఆడుతున్న భువనేశ్వర్, అశ్విన్.. చావ్లాను అధిగమించే అవకాశాలు ఉన్నాయి.