టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. బుధవారం నాడు క్రికెటర్ భువనేశ్వర్ ఇంట్లో సంతోషం నెలకొంది. ఎందుకంటే అతడు తొలిసారిగా తండ్రయ్యాడు. భువనేశ్వర్ భార్య నుపుర్ నగర్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2017 నవంబర్ 23న వీరికి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వివాహం జరిగింది. నాలుగో వార్షికోత్సవం ముగిసిన మరుసటి రోజే భువీ భార్యకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఉదయం 9 గంటలకు…