నేడు తెలంగాణ రాష్ట్రానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రానున్నారు. విజయ సంకల్ప యాత్రలో పాల్గొనబోతున్నారు. కాగా, ఇవాళ రాత్రి సికింద్రాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
గుజరాత్ శాసన సభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయనను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గుజరాత్ సర్కార్‌లో వేగంగా పరిణామాలు మరిపోయాయి.. సీఎం పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ.. ఆ తర్వాత తదుపరి గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ పేరును ప్రతిపాదించారు.. ఇక, అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. మొత్తంగా గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు 59 ఏళ్ల భూపేంద్ర పటేల్..