Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం
- గాంధీనగర్ మార్కెట్‌లో షాపింగ్ చేసిన సీఎం భూపేంద్ర పటేల్
- మనవడితో కలిసి సాధారణ వ్యక్తిలా తిరిగిన సీఎం
- మార్కెట్లో ఉన్న వారందరితో మాట్లాడి.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి సందర్భంగా తన మనవడితో కలిసి గాంధీనగర్ మార్కెట్‌లో షాపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. ఒక సాధారణ వ్యక్తిలా జనంలో కలిసిపోయి.. అందరిని అప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Harassment: నీ ఏజ్ ఏందీ.. కింద గేజ్ ఏందీ.. ట్రైన్ లో ఆ గలీజ్ పనులేంది
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
దేశవ్యాప్తంగా దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ వెలుగుల పండుగ సందర్భంగా అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ఫోటో వైరల్ అవుతోంది. అదేంటంటే.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సోమవారం దీపావళి జరుపుకోవడానికి తన మనవడితో కలిసి మార్కెట్‌ను వచ్చారు. ముఖ్యమంత్రి గాంధీనగర్ వీధుల్లో సాధారణ వ్యక్తిలా కనిపించారు. ఆయన తన మనవడితో కలిసి దీపావళికి షాపింగ్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి ఓ సాధారణ వ్యక్తిలా షాపింగ్ చేయడం చూసి అక్కడున్న ప్రజలు, దుకాణదారులు ఆశ్చర్యపోయారు.
Read Also:Bollywood Actor: పండగ పూట విషాదం.. ప్రముఖ హస్య నటుడు మృతి
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్థానిక విక్రేతల నుండి దీపాలు సహా వివిధ వస్తువులను కొనుగోలు చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని ఈ విధంగా ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి మనవడు కూడా మార్కెట్లో కొనుగోలు చేశాడు. అయితే వారు రోడ్డుపై షాపింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన తన మనవడితో కలిసి మార్కెట్ అంతా కలియ తిరిగారు. మార్కెట్లో, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దుకాణదారులతో సంభాషించి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి సింప్లిసిటీకి స్థానికులు ముగ్ధులయ్యారు. “సీఎం అంటే కామన్ మ్యాన్” అనే సామెతను భూపేంద్ర పటేల్ నిరూపించారు స్థానికులు చెప్పుకుంటున్నారు. అంతకుముందు ఆయన అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.
PHOTO | Diwali 2025: Gujarat Chief Minister Bhupendra Patel was seen shopping with his grandson at a market in Gandhinagar earlier today. He bought diyas and other items from local vendors while promoting the ‘Vocal for Local’ campaign.
(Source: Third Party) pic.twitter.com/dqPtHxkCd6
— Press Trust of India (@PTI_News) October 20, 2025
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!