చత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అన్నె సంతోష్ @ సాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. బీజాపూర్ లో సంతోష్ మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో.. స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (మం) స్వగ్రామం దస్తగిరిపల్లికి చేరింది. అయితే.. స్వగ్రామానికి తీసుకువచ్చిన వృద్ధ తల్లిదండ్రులు అంతక్రియలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియల్లో గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎర్రజెండాలతో స్వాగతం పలికుతూ అంతిమయాత్ర నిర్వహించారు. కన్నీటి పర్యంతంతో గ్రామస్తులు…
భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా జై కాంగ్రెస్... జై సత్తన్న నినాదాలతో మొగుళ్ళపల్లి బస్టాండ్ సెంటర్ దద్దరిల్లింది.
తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు కాకతీయ ఉత్సవాలు. వారంపాటు జరిగే వేడుకలకు కాకతీయ రాజుల వారసులను ఆహ్వానించారు. నాటి కాకతీయ రాజుల చరిత్ర నేటి తరానికి చాటి చెప్పేలా ఏర్పాట్లు చేసినా.. వేడుకల్లో రాజకీయాలు చొచ్చుకొచ్చాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబురాలను కేవలం ఇద్దరు ముగ్గురు నాయకులకే పరిమితం చేయడం ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్‌లో చర్చగా మారింది. వరంగల్‌లోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకే వేడుకల్ని పరిమితం చేశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రాష్ట్రం మొత్తం…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆపారమైన సహజ సంపదకు కేరాఫ్ గా మహదేవపూర్ ప్రాంతం నిలుస్తుందని చెప్పడంలో అతియోశక్తి లేదు. టేకు కలప, ఇసుక ఇప్పటికే ఉండగా బొగ్గు నిక్షేపాలతో మరోమారు దేశం దృష్టిని ఆకర్షించనుంది. మహదేవపూర్ లో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రపంచ స్థాయి గుర్తింపు రాగా చండ్రుపల్లిలో బొగ్గు నిక్షేపాలు జాడలు బయటపడటంతో మరోసారి ఆ ప్రాంతంపై అందరి దృష్టి పడింది. రెండేళ్ల కిందట రైతు జాడి సురేందర్ తన పొలంలో వ్యవసాయానికి ప్రైవేటు వాహనంతో…
భూపాలపల్లి నుంచి బొగ్గు రవాణా నిలిపివేశారు. భూపాలపల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే స్థానిక తాడిచర్ల సింగరేణి బొగ్గును వినియోగించాలని, ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తాడిచర్ల నుంచి బొగ్గు ఇతర రాష్ట్రాలకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు రాష్ట్ర సింగరేణి అధికారులకు మౌఖికంగా ఆదేశించారని వినోద్ కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉందని…