Medaram Temple: నీటమునిగిన సమ్మక్క సారలమ్మల గద్దెలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు వస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వాగు ఉప్పొంగడంతో గ్రామం మొత్తం జలమయమైంది. అటు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ గిరిజన ఆలయంగా వెలుగొందుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం నీట మునిగింది. గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది.
Read Also: Supreme Court: కేంద్రానికి సుప్రీంలో ఊరట.. ఈడీ డైరక్టర్ పదవీకాలం పొడిగింపుకు అనుమతి
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
అయితే, గోవిందరావు పేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో కోతకు గురైంది. దీంతో తాడ్వాయి, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లక్నవరం జలాశయం పరవళ్లు తొక్కుతూ ఉండటంతో సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Read Also: Warangal Floods: వరంగల్‌లో నీట మునిగిన లేడీస్ హాస్టల్.. సాయం కోసం బిల్డింగ్ ఎక్కిన స్టూడెంట్స్..
మరో వైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాజీపేట రైల్వే స్టేషన్, వరంగల్ బట్టల బజార్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. హనుమకొండ-వరంగల్ రహదారి బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు భారీగా నిలిచిపోయింది. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధమవ్వగా, పంతిని దగ్గర ఊర చెరువు ఉప్పొంగడంతో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. మైలారం వద్ద భారీ చెట్టు కూలి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
తాజావార్తలు
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!