యంగ్ డైరెక్టర్ సంపత్ నంది స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. ఈ చిత్రంలో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఆగష్టు 31 మంగళవారం ఉస్తాద్ రామ్ పోతినేని ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇందులో ఉన్న మసాలా, ఎంటర్‌టైనర్ వంటి అన్ని అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన 24 గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. పవర్-ప్యాక్డ్ “సీటిమార్”…
హీరో గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ‘సీటీమార్’.. గోపీచంద్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో ‘సీటీమార్’ ట్రైలర్ విడుదల చేశారు. గోపీచంద్ ఆంధ్ర కోచ్ గా, తమన్నా తెలంగాణ కోచ్…
(ఆగస్టు 21న భూమిక బర్త్ డే) చూడగానే తెలిసినమ్మాయి అనిపిస్తుంది భూమిక. ముద్దొచ్చే రూపంతో ఇట్టే తెలుగువారిని పట్టేసింది. తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసిన భూమిక ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా బిజీగానే సాగుతున్నారు. ఉత్తరాది అమ్మాయి అయినా, దక్షిణాది వాసనలనే ఇష్టపడింది భూమిక. అందుకే తెలుగు, తమిళ చిత్రాలలో ఆమెకు మంచి పాత్రలు లభించాయి. వాటితో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు భూమిక. నాగార్జున నిర్మించిన తెలుగు చిత్రం ‘యువకుడు’ ద్వారా భూమిక చావ్లా సినిమా…
టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన భూమిక చావ్లా… స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే యోగా టీచర్ భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఇక ఇటీవల ఈ సీనియర్ నటి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. నచ్చిన సినిమాల్లో అప్పుడప్పుడు కీలక పాత్రల్లో తళుక్కుమంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తుంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, పర్సనల్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అయితే, తాజాగా…
బుల్లితెర బిగ్ బాస్ షో ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ నడుస్తోంది. కన్నడ, మళయాలం, తెలుగు, తమిళం, బెంగాలీ ఇలా ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ షో ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. అయితే ఈ షో గురించి, ఆమెకు వస్తోన్న ఆఫర్ల గురించి హీరోయిన్ భూమిక తాజాగా స్పందించారు. తనకు ఆఫర్లు వచ్చిన మాట నిజమే గానీ వాటిని ఇంత వరకు అంగీకరించలేదు.. ఎప్పుడూ అంగీకరించను కూడా అని తెగేసి చెప్పేశారు. ఇక హిందీలో పద్నాలుగు…