వైసీపీ పై భూమా అఖిల ఫైర్ అయ్యారు.. వైసీపీ వెన్నుపోటు దినంతో ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. తాజాగా నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. "వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు... మద్య నిషేధం పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు... వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత సోదరికి వెన్నుపోటు పొడిచారు.. సొంత చెల్లిని, తల్లిని బయటికి గెంటేసి జగన్ వారికి వెన్నుపోటు పొడిచారు.. రైతులకు, రాష్ట్రానికి…
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం...ఒకప్పుడు ఫ్యాక్షన్ అడ్డాగా, బాంబుల గడ్డగా ప్రసిద్ధి. ఇక్కడ ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి విలవిల్లాడిన కుటుంబాలు ఎన్నో. పార్టీలతో సంబంధం లేకుండా పర్సనల్ కక్షలతోనే నరుకుడు ప్రోగ్రామ్స్ నడిచేవి. అయితే... రెండు దశాబ్దాల నుంచి ఆ తీవ్రత బాగా తగ్గింది. రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఆళ్ళగడ్డలో టీడీపీకి బలమైన క్యాడర్ వుందని చెబుతారు.
గత కొంతకాలంగా సైలెంట్ గా వున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పీడ్ పెంచారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అక్రమ కూల్చివేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అఖిలప్రియ. ఇంటిస్థలంపై కోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసుల్ని, అధికారుల్ని ముందుపెట్టుకొని ఇంటిని కూల్చారంటూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి అఖిల ప్రియ. టీడీపీ ప్రభుత్వం రాగానే మీ కంటే రెండింతలు ఎక్కువ చేస్తాం అంటూ వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు అఖిలప్రియ. వైసీపీ నాయకులకు ఓర్పు లేక, తీవ్రమైన…