అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. భోగి ప్రతి ఇంట భోగభాగ్యాలు కలిగించాలని కోరుతూ భక్తి పార్వసంగా సంబరాలు జరిగాయి. భోగి మంటలను వెలిగించి వేడుకలను ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ప్రారంభించారు.
పల్నాడు జిల్లా సత్తనపల్లి గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి అంబటి రాంబాబు అధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంక్రాంతి వేడుకలకు ప్రజలు భారీగా హాజరు అయ్యారు. భోగి వేడుకలలో భాగంగా మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక డాన్స్ చేశాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. మూడ్రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేసుకుని.. వాటి చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు.
హైదరాబాద్‌లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ భోగి పండుగ కావడంతో.. నగరంలో భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి మంటల చుట్టూ యువతులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా భోగిని ఆశ్వాదిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండుగ సందడితో కళకళలాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో బోగి మంటలు మండుతున్నాయి.