Chiranjeevi – Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న వీడియోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోకు.. కొన్ని సందర్భాల్లో మాటలు అవసరం లేదు అనే…
మెగాస్టార్ చిరంజీవి – నయనతార జంటగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై భారీ అంచనాలు వేళ్లూనుకున్నాయి. అనిల్ రావిపూడి మాస్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ కలిపిన స్టైల్‌కు చిరంజీవి కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్‌లో పాజిటివ్ వైబ్స్ మొదటి నుంచే నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో విడుదలైన మొదటి సాంగ్ ‘మీసాల పిల్ల’ యూట్యూబ్, సోషల్ మీడియాలో దూసుకుపోతూ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని, స్క్రీన్‌పై చిరు – నయనతార…
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం నుండి మొదటి పాట వచ్చేసింది. ఇప్పటికే అద్భుతమైన స్పందనతో రికార్డు వ్యూస్ సాధించిన ప్రోమో తర్వాత, ‘మీసాల పిల్ల’ పూర్తి లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట సంగీత ప్రియులను, మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ‘మీసాల పిల్ల’ పాట పవర్‌ఫుల్ ఎలక్ట్రానిక్ బీట్స్,…