ప్రముఖ మలయాళీ నటి భావన ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అత్యంత వివాదాస్పద సంఘటన గురించి మాట్లాడింది. 2017లో ఒక సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని భావన తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, ఆమెను కిడ్నాప్ చేసి 2 గంటలకు పైగా దాడి చేశారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. సుప్రసిద్ధ మలయాళీ హీరో దిలీప్ కు కూడా ఈ కేసుతో సంబంధం ఉండడంతో ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దిలీప్ బెయిల్‌పై విడుదలయ్యాడు.…