హీరో దాడి… దారుణమైన ఘటనపై హీరోయిన్ ఫస్ట్ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మలయాళీ నటి భావన ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అత్యంత వివాదాస్పద సంఘటన గురించి మాట్లాడింది. 2017లో ఒక సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని భావన తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, ఆమెను కిడ్నాప్ చేసి 2 గంటలకు పైగా దాడి చేశారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. సుప్రసిద్ధ మలయాళీ హీరో దిలీప్ కు కూడా ఈ కేసుతో సంబంధం ఉండడంతో ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దిలీప్ బెయిల్‌పై విడుదలయ్యాడు. కేసు ఇంకా కొనసాగుతోంది. ఈ దారుణమైన ఘటన జరిగి ఐదేళ్లు పూర్తయ్యింది. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ను భావన షేర్ చేసింది.
Read Also : వైరల్ వీడియో : శ్రియా సీక్రెట్ కు ఏడాది !
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
“ఇది అంత తేలికైన ప్రయాణం కాదు. బాధితురాలి నుండి ప్రాణాలతో బయటపడే ప్రయాణం. ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి బరువుతో నా పేరు, నా గుర్తింపు అణచివేయబడింది. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానపరచడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అలాంటి సమయంలో నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా గొంతులు వింటున్నాను. న్యాయం కోసం ఈ పోరాటంలో నేను ఒంటరిగా లేనని నాకు తెలుసు. న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను ఈ ప్రయాణం కొనసాగిస్తాను. నాతో పాటు నిలబడిన వారందరికీ మీ ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది భావన.
Read Also : యంగ్ టైగర్ న్యూ లుక్… కోర మీసంతో క్లాసీ పిక్
ఐదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన మలయాళ చిత్ర పరిశ్రమనే కాదు, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమను కూడా కదిలించింది. ఆ తరువాత భావన నవీన్‌ను వివాహం చేసుకుంది. ఆమె ఇప్పుడు కన్నడ సినిమాలలో బిజీగా ఉంది. కొంతమంది వ్యక్తుల కారణంగా భావనకు మలయాళ ఆఫర్లు రావట్లేదని పుకార్లు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు ఈ కేసులో కేరళ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ లైంగిక వేధింపులు చేసిన నేరస్థులపై క్రిమినల్ కేసును కూడా ప్రారంభించింది. ఈ కేసులో మొత్తం 6 మంది నిందితులలో దిలీప్ ఒకడు. కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఇంకా కొనసాగుతోంది.
ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ను దిలీప్ తో పాటు నిందితులు బెదిరించడంతో వారిపై మరో కేసు నమోదైంది. కేసును పర్యవేక్షిస్తున్న పోలీసును చంపడానికి కుట్ర పన్నుతున్న ఆడియో క్లిప్ లు బయటకు రావడంతో దిలీప్‌పై మరికొన్ని ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. వారిపై IPC సెక్షన్లు 116 (ఖైదుతో శిక్షార్హమైన నేరాన్ని ప్రోత్సహించడం), 118 (మరణశిక్ష విధించదగిన నేరానికి రూపకల్పన చేయడం లేదా జీవితాంతం జైలు శిక్ష విధించడం), 120B (నేరపూరిత కుట్రకు పక్షం), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (నేరసంబంధం) కింద కేసులు నమోదు చేశారు. కొత్త ఎఫ్ఐఆర్ దిలీప్, సూరజ్, దిలీప్ సోదరుడు అనూప్, ఒక వీఐపీ మరియు మరో ఇద్దరితో సహా ఆరుగురిపై నమోదు అయ్యింది. ఈ కేసులో కేరళ ప్రభుత్వం కొత్త బృందాన్ని ఏర్పాటు చేసింది.

తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?