ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ స్కూల్ భవనాల నిర్మాణాల కోసం ఆయా నియోజకవర్గాల్లో కావలసిన స్థలాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని స్థలాన్ని సేకరించి డిజైన్స్ వేయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ వార్షిక సంవత్సరం రూ. 5 వేల కోట్లతో 30 కాంప్లెక్స్ లో 120 గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టడానికి కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఎస్సీ…
మనం అందరం కలిసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్పీడీసీఎల్ లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లును పెద్ద ఎత్తున అభినందించగా ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మార్పు అంటే వారి జీవనస్థితిగతులు మారడం, కొనుగోలు శక్తి పెరగడం, రాష్ట్ర సంపదలో అంతా…
ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ లో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల ముందు ఛాలెంజ్ చేసి రుణ మాఫీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ రోజు చరిత్రలో లిఖించదగిన రోజు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశ చరిత్రలో తొలిసారి రూ.2లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఛాలెంజ్ చేసి ఆగస్టు 15నాటికి రుణమాఫీ చేస్తామని…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయాన్ని డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క, ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనమనేని సాంబశివరావు పరిశీలించారు. జిల్లా అధికారులతో కలిసి బోటులో కిన్నెరసాని జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. టూరిజం హబ్‌గా కిన్నెరసాని, హోలాండ్ తరహలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యాటక అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేవిధంగా ప్రణాళిక చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం…
మూడో విడత రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు శుభవార్త చెప్పారు. ఆగస్ట్ 15న మూడో విడత రుణమాఫీ చేస్తామని ఈరోజు తెలిపారు. వైరాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నుంచే రుణ మాఫీ జరుగనుంది.. ఇది రైతుల అదృష్టమని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రతిపక్షాల నాయకులు అంతా కూడా భ్రమల్లో ఉండి పోయారని ఆరోపించారు.
Sunkishala Project: నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. సుంకిశాల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు.
Bhatti Vikramarka: నేడు ఖమ్మం జిల్లాలోని వైరాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు వైరాలో అమృత్ 2.0 పథకం పనులతో పాటు..
వర్షాల నేపథ్యంలో చెట్లు, స్థంబాలు, విద్యుత్ వైర్స్ ఒరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అయితే.. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ నగరం దేశానికి తలమానికమని, హైదరాబాద్ కు చాలా మల్టిలేవల్ కంపెనీలు వస్తున్నాయన్నారు. వాటికి కూడా విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలని సూచించామని ఆయన తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో అధికారులతో మాట్లాడి ముందుకు వెళ్తామని, సుంకిశాల గోడ కూలిందని చూశానని, హైదరాబాద్ కి నీటి…
నేడు ఆదిలాబాద్ జిల్లాకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రానున్నారు. పాదయాత్ర ప్రారంభించిన ఊరు పిప్పిరిలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు పిప్పిరి గ్రామానికి డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క చేరుకోనున్నారు. అధికారులతో జిల్లా అభివృద్ది పురోగతి, అమలవుతున్న పథకాలు, సంక్షేమం గురించి సమీక్షిస్తారని, ఆ తరువాత ఎస్టీఎస్‌డిఎఫ్ రూ.15 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.2 కోట్లతో వాంకిడి సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. రూ.3.5 కోట్లతో పిప్పిరి…
ప్రజావాణి ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం సచివాలయంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.