Koti Deepotsavam Day 12: కార్తీకమాసం పర్వదినాల్లో భాగంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 పన్నేండవ రోజు కార్యక్రమాలు అద్భుత ఆధ్యాత్మిక వైభవంతో మెరిశాయి. ఎన్టీఆర్ స్టేడియం భక్త కోలాహలం మధ్య శివ నామస్మరణతో మార్మోగింది. వేలాది భక్తులు ఒకే స్వరంతో “ఓం నమః శివాయ” జపిస్తూ వెలిగించిన దీపాలు ఆ ప్రాంగణాన్ని దివ్యజ్యోతి ప్రదేశంగా మార్చేశాయి. ప్రతి దీపం ఆత్మజ్యోతి సందేశాన్ని అందిస్తూ భక్తుల హృదయాలను పరవశింపజేసింది. 2012లో ఆరంభమైన…