హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ .గోపాల్ రెడ్డి కలసి ‘మువ్వగోపాలుడు’తో హ్యాట్రిక్ సాధించారు. అంతకు ముందు ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ‘మంగమ్మగారి మనవడు’ 560 రోజులు, ‘ముద్దుల క్రిష్ణయ్య’ 365 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించాయి. వీరి కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘మువ్వగోపాలుడు’ సైతం 300 రోజులు ప్రదర్శితమయింది. ఇలా వరుసగా ముగ్గురు కలసి మూడు త్రిశతదినోత్సవాలు చూసిన ఘనత అప్పటి దాకా ఎవరికీ లేదు.…