5జీ స్పెక్ట్రమ్ వేలంలో గురువారం మూడో రోజు ముగిసే సమయానికి ప్రభుత్వానికి 1,49,623 కోట్ల రూపాయల విలువైన బిడ్‌లు వచ్చాయి. కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేలం మూడో రోజు ముగిసే వరకు 16 రౌండ్ల బిడ్డింగ్‌లు పూర్తయ్యాయి. శుక్రవారం నాలుగో రోజు వేలం కొనసాగనుంది.
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా హైస్పీడ్ ఇంటర్నెట్ వచ్చేలా చూసేందుకు ఎలన్ మస్క్ స్టార్ లింక్స్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎలన్ మస్క్‌కు పోటీగా ఎయిర్‌టెల్ వన్‌వెబ్ పేరుతో ఫ్రెంచ్ గయానాలోని కౌర్ స్పేస్ సెంటర్ నుంచి భారతీ ఎయిర్‌టెల్ 34 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇంటర్నెట్ కోసం ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ఏడాది ఎయిర్ టెల్ ప్రయోగించిన మొదటి ప్రయోగం ఇది. 34 ఉపగ్రహాలను…