శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఇప్పటికే బాల నటుడిగానే కాకుండా యువ కథానాయకుడిగానూ ‘నిర్మలా కాన్వెంట్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాస్తంత గ్యాప్ తీసుకుని సెప్టెంబర్ మాసంలో ‘పెళ్ళి సందడి’తో మరోసారి హీరోగా సందడి చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… శ్రీకాంత్, ఊహ కుమార్తె మేథ సైతం త్వరలో పూర్తి స్థాయిలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతోందట. గతంలో గుణశేఖర్ రూపొందించిన ‘రుద్రమదేవి’ చిత్రంలో బాలరుద్రమగా శ్రీకాంత్ కూతురు మేథ నటించింది. ఆ సినిమాలో రోషన్ చిన్నప్పటి రానా…