ఓవైపు హీరోలందరూ ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనమౌతుంటే.. నేచురల్ స్టార్ నాని మాత్రం కనీసం మూడు సినిమాల్ని రిలీజ్ చేస్తున్నాడు. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి సుడి తిరగడంతో, వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ నేచురల్ స్టార్.. లేటెస్ట్‌గా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట!…
నాచురల్ స్టార్ నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విడుదల అయ్యి నేటికి ఆరేళ్ళు అవుతోంది.. ఈ చిత్రంతో నాని ప్రత్యేక గుర్తింపు పొందాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మతిమరుపును ప్రధానాంశంగా కథను రాసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. నానిని నటన పరంగాను మరోమెట్టు ఎక్కించింది ఈ సినిమా. ఆయన సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. ఆమె కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్ చిత్రం కావడం విశేషం. గోపీసుందర్ అందించిన పాటలు…