భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తిక సోమవారం సందర్భంగా నిన్న ఎన్టీఆర్ స్టేడియం భక్తజన సంద్రంగా మారింది. భక్తి టీవీ కోటిదీపోత్సవం-2022 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది..
ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి…సోమవారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=6-nSnfl3GBo
ఏపీ సీఎం జగన్ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. చిన ముషిడివాడలోని శారదాపీఠం నిర్వహిస్తున్న వార్షికోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం కోసం ముఖ్యమంత్రితో పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జగన్ చేతుల మీదుగా కలశ స్థాపన చేయించారు. రాజశ్యామల యాగంలో జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణమ్మ పాల్గొన్నారు. స్వామివారు జగన్ ని ఆశీర్వదించారు.
హైదరాబాద్ ముచ్చింతల్ లో సమతా స్ఫూర్తి విగ్రహం కనుల పండువగా ఆవిష్కారం అయింది. సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోదీ ఆహార్యం చూపరుల్ని విశేషంగా ఆకర్షించింది. యాగంలో పాల్గొనేందుకు వీలుగా వస్త్రధారణతో.. విష్ణునామాలు పెట్టుకుని విచ్చేశారు. బంగారు వర్ణపు పంచె ధరించి విష్వక్సేనేష్టి యాగానికి హాజరయ్యారు. ఉజ్జీవన సోపాన వేదిక నుంచి లేజర్ షో వీక్షించే వేదిక వరకు నడుచుకుంటూ వచ్చారు. సభ ముగిశాక ఉజ్జీవన సోపానంపై నుంచి 108 మెట్లు దిగి కిందికి వచ్చారు. భారతదేశ…
ఈ నెల 12 నుంచి 22 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. వేలాదిమంది భక్తులు స్టేడియానికి తరలివచ్చి కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు. ఇవాళ్టికి భక్తి టీవీ కోటిదీపోత్సవం నేడు 9వ రోజుకు చేరుకుంది. సుందరంగా అలకంరించిన వేదికపైన మైసూరు అవధూతపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచనామృతం భక్తులకు శ్రవణానందాన్ని కలిగించింది. వైభవోపేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి…