భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తిక సోమవారం సందర్భంగా నిన్న ఎన్టీఆర్ స్టేడియం భక్తజన సంద్రంగా మారింది. భక్తి టీవీ కోటిదీపోత్సవం-2022 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది.. ఉత్సవంలో భాగంగా ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు.. ఇక, బ్రహ్మశ్రీ డా.బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే ప్రవచనామృతం గావించారు.. ఉత్సవంలో భాగంగా కాశీస్పటికలింగానికి సహస్ర కలశాభిషేకం, కోటి మల్లెల అర్చన వైభవంగా సాగింది… శ్రీ భ్రమరి వేదశంకర స్మార్థ వేదపాఠశాల విద్యార్థులచే వేదపఠనం జరిగింది.. ఇక, మొదటి రోజు కోటిదీపాల ఉత్సవంలో భాగంగా కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది… పరమ శివునికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈనెల 14వ తేదీ వరకూ భక్తి టీవీ కోటిదీపోత్సవం కొనసాగనుంది. కోటి దీపోత్సవం రెండవ రోజు విశేష కార్యక్రమాలు వుంటాయి.
మొదటి రోజు హంస వాహనంపై కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి ఉత్సవమూర్తులు ఊరేగింపు కన్నులపండుగగా సాగింది.. ఉత్సవంలో భాగంగా శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ అనుగ్రహభాషణం నిర్వహించారు.. కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కల్యాణంలో పరమ పవిత్రమైన కంకణ ధారణ – రక్షా బంధనం, కల్యాణంలో యోగాన్ని కలిగించే యజ్ఞోపవీత ధారణ, ముక్తేశ్వర స్వామి కల్యాణంలో జీలకర్ర బెల్లం శుభముహూర్త ఘట్టం, మాంగల్య బలాన్ని ఇచ్చే మంగళసూత్ర ధారణ ఘట్టం వైభవంగా సాగాయి..
మొదటి రోజు ఉత్సవంలో భాగంగా కార్తికదీపారాధన, సకల పాపాలు తొలగించే మహా శివలింగానికి ప్రదోషకాల అభిషేకం, సహస్ర కలశాభిషేకం, కోటిమల్లెల అర్చన, సప్త హారతి వైభవంగా సాగాయి..ఈ కోటి దీపోత్సవం కోసం ప్రతి రోజూ ఎన్టీఆర్ స్టేడియం అందంగా ముస్తాబవుతోంది. కోటి దీపోత్సవానికి అవసరమయిన అన్ని పూజా సామాగ్రి, పూలు భక్తి టీవీ భక్తులకు ఉచితంగా అందిస్తోంది. ప్రతిరోజూ కోటి దీపోత్సవానికి రావాలని భక్తులు కోరుకుంటారు. రాలేని వారు ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరిస్తున్నారు. కోటి దీపోత్సవానికి వచ్చే భక్తులకు ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. పరమ పవిత్రమయిన కార్తీక మాసంలో ఆ పరమ శివుని అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటోంది రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ కుటుంబం.
నవంబర్ 01, కోటి దీపోత్సవం 2వ రోజు విశేష కార్యక్రమాలు
శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామీజీ (కుర్తాళం పీఠం) రమ్మానంద భారతీ మాతాజీ ( శ్రీ శక్తి పీఠం) వారిచే అనుగ్రమ భాషణం
బ్రహ్మ శ్రీ నోరి నారాయణమూర్తి వారిచే ప్రవచనామృతం
కోటి దీపోత్సవం వేదికపై కంచి కామాక్షికి కోటి పసుపుకొమ్ముల సుమంగళీ పూజ
కామాక్షి అమ్మవారికి కోటి పసుపు కొమ్ముల అర్చన భక్తులు చేసే మహదావకాశం
అలంపురం శ్రీ జోగులాంబ కల్యాణం
నంది వాహనంపై వాహన సేవ వుంటుంది