జయ జయ శంకర… శివ శివ శంకర… శంభో శంకర.. హర హర మహాదేవ.. శివ శివ శంకర.. హరహర శంకర అంటూ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం మారుమోగిపోయింది. భక్తుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఈనెల 12వ తేదీన ప్రారంభమయిన భక్తి టీవీ కోటిదీపోత్సవం అప్రతిహతంగా సాగిపోతోంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా భక్తిటీవీ కోటి దీపోత్సవం నిర్వహించారు. వేలాదిగా హాజరైన భక్తులు జ్వాలాతోరణం వీక్షిస్తూ పరవశించారు. నిండుపున్నమి వెలుగులో శ్రీశైల మల్లన్న…
భక్తిటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుక ఈ సంవత్సరం కూడా భక్తకోటిని ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తుతోంది. నవంబర్ 12వ తేదిన అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ కోటి దీపోత్సవ వేడుక నేడు 8వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విశేషాలను చూద్దాం.. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుచే ప్రవచనామృతం. అనంతరం మొట్టమొదటిసారిగా ఉజ్జయిని అర్చకులచే మహాకాళేశ్వర భస్మహారతి, బిల్వార్చన కార్యక్రమం వేదికపైనే కాకుండా భక్తులచే కూడా నిర్వహించనున్నారు. ఆ…
భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. కార్తీక మాసాన హైదరాబాద్ జంట నగర ప్రజలను ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలేలా చేస్తోంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం గురువారం ఏడోరోజుకు చేరింది. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఏడోరోజు వేలాది మంది భక్తులు కోటి దీపోత్సవం ప్రాంగణానికి తరలివచ్చారు. ఏడోరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు అందజేశారు. ఏడోరోజు సందర్భంగా…
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈనెల 12న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 22 వరకు కొనసాగనుంది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు 16 ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అధికారులు…
భక్తి టీవీ కోటి దీపోత్సవం కనుల పండువగా సాగిపోతోంది. కార్తికమాసాన జంటనగరవాసుల్ని ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలేలా చేస్తోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవం 3వ రోజు వేలాదిమంది ఎన్టీఆర్ స్టేడియానికి తరలివచ్చారు. మూడవరోజు కోటి దీపోత్సవానికి హాజరయ్యారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. వేదపండితులు ఆశీర్వాదాలు అందచేశారు. కోటి దీపోత్సవం ద్వారా ఎన్టీవీ, భక్తిటీవీ చేపడుతున్న సేవల్ని కొనియాడారు. ఎన్టీవీ ఛైర్మన్ తుమ్మల నరేంద్రచౌదరి దంపతుల్ని సీపీ అంజనీకుమార్ అభినందించారు. ఇవాళ్టి కోటి దీపోత్సవంలో హర్యానా…
కార్తీకం వచ్చిందంటే భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతాయి. కోటికాంతులు భక్తుల మనసులను పులకింపజేస్తాయి. ఓంకారానికి తోడు శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు దీపోత్సవానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తిటీవీ కోటిదీపోత్సవం నిర్వహిస్తోంది.. ఇవాళ్టి నుంచీ ఈ నెల 22వ తేదీ వరకు కన్నుల పండువగా ఈ కార్యక్రమం జరుగుతోంది.. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతీరోజు…