హైదరాబాద్ శివారున వున్న ముచ్చింతల్‌కు సమీపంలోని శ్రీరామనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. శ్రీ రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా…. 216 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇవాళ్టి నుంచి 14 వరకు జరిగే… వివిధ కార్యక్రమాలకు… శ్రీరామ నగరాన్ని ముస్తాబు చేశారు. ఇప్పటికే సమతామూర్తి విగ్రహం ఎప్పుడు ఆవిష్కారం అవుతుందా అని భక్తులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.…
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో మచ్చింతల్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్న విషయం తెల్సిందే. అయితే ఈ ఉత్సవాలకు అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చకచక జరిగిపోయాయి. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే చిన్న జీయర్ స్వామి స్వయంగా ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను సైతం పంచారు. చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రంలో సమతా స్ఫూర్తిని పంచిన…