ఎరువుల కొరతపై కేంద్ర మంత్రిని ప్రశ్నించాడు.. వచ్చే ఎన్నికల్లో మా ఏరియాలో ఓట్ల అడగాలని సవాల్ విసిరాడు.. చివరకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కర్ణాటక బీదర్ లోని హెడపురా గ్రామానికి చెందిన కుశాల్ పాటిల్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎరువుల కొరత గురించి కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహయమంత్రి భగవంత్ ఖూబాకు ఫోన్ చేశాడు. అయితే వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషన వైరల్ గా మారింది. దీనిపై విచారించిన విద్యాశాఖ అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది.…