నందమూరి బాలకృష్ణను కలిసిన ఎన్టీయార్ శతజయంతి కమిటీ గత ఆరునెలలుగా తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించింది. 'జయహో ఎన్టీయార్' పేరుతో వెబ్ సైట్ ను, 'శకపురుషుడు' పేరుతో ప్రత్యేక సంచికను తీసుకు రాబోతున్నట్టు తెలిపింది.
సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన 'మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్టీయార్' పుస్తకానికి తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 29న ఈ పురస్కార ప్రదానం జరుగనుంది.