NTR: నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన ‘మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్టీయార్’ పుస్తకానికి తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారాన్ని ప్రకటించింది. జీవిత చరిత్ర విభాగంతో ఈ పుస్తక రచయితను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు కిషన్ రావు తెలిపారు. విద్యార్థి దశలోనే రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించిన భగీరథ జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించారు. పలు దిన పత్రికలలో పనిచేశారు. అదే సమయంలో కథలు, నవలలు రాశారు. సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను పుస్తక రూపంలో వెలువరించారు. ఆయన రాసిన తాజా గ్రంథం ‘మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్టీయార్’ కు ఇప్పటికే కమలాకర కళాభారతి, ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ ఎన్. టి .ఆర్ అవార్డులు లభించాయి. ఇప్పుడు ప్రకటించిన కీర్తి పురస్కారాన్ని ఈ నెల 29న తెలుగు విశ్వ విద్యాలయంలో ప్రదానం చేయనున్నారు.