పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి బయటకు దూకిన సిబ్బంది ప్రాణాలు దక్కించుకున్నారు. మధ్య ప్రదేశ్ లోని బేతుల్ జిల్లా గౌలా గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు, కారు ముందు వైపు నుండి ఒకదానికొకటి ఢీకొట్టకున్నాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందిరు.