Story Board: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్…సామాన్యుల ప్రాణాలు తీస్తున్నాయి. ఊరించే ప్రకటనలు…సెలబ్రెటీల ప్రచారంతో…అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యులనుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల దాకా…వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. కోట్లు పెట్టి బెట్టింగ్ ఆడుతున్నారు. అప్పులు చేసి బెట్టింగ్‌లో పెడుతున్నారు. అది సరిపోక…బ్యాంక్‌ల నుంచి లోన్లు తీసుకొని బెట్టింగ్ ఆడుతున్నారు. బెట్టింగ్ యాప్స్…సామాన్యులకు మరణశాసనం రాస్తున్నాయి. బెట్టింగ్ ఆడవద్దని చెబుతున్నా…కొందరు పట్టించుకోవడం లేదు. డబ్బు పొగొట్టుకున్న తర్వాత…ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నారు. ఇంకొందరు దొంగలుగా మారుతున్నారు. మరికొందరు…
Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆగస్టు 13న) ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు..
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA)కి హైకోర్టు న్యాయవాది కృష్ణ కాంత్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలెబ్రిటీలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. CCPA ఈ విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తూ, సెలెబ్రిటీలు మూడేళ్ల పాటు ఇలాంటి యాడ్స్ చేయకుండా నిషేధం విధించే యోచనలో ఉంది. అంతేకాకుండా, ఈ యాప్స్‌ను ప్రచారం చేసిన వారికి 10 లక్షల నుండి…
తెలుగు మోటోవ్లాగర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరొందిన బయ్యా సన్నీ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో అతను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది, అయితే తదుపరి విచారణను మార్చి 24, 2025కి వాయిదా వేసింది. సన్నీ యాదవ్‌పై మార్చి 5, 2025న నూతనకల్ పోలీస్…
బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ స్పష్టం చేశారు. సినీ నటులు, టీవీ యాంకర్లు ఇలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించిన వెంటనే వారిపై విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 11 మంది బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహించిన వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.