మిథున్ చక్రవర్తి, శృతి హాసన్, అర్జన్ బజ్వా, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సోనలీ కులకర్ణి కీలక పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బెస్ట్ సెల్లర్’. నిర్మాతలు మంగళవారం అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంటెలిజెంట్, గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ముకుల్ అభ్యంకర్ దర్శకత్వం వహించిన ‘బెస్ట్ సెల్లర్’ ఫిబ్రవరి 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది.…
ప్రముఖ నటుడు కమల్ హాసన్, నటి సారిక కుమార్తె శ్రుతీహాసన్ కు వెండితెర మీద సక్సెస్ లభించడానికి చాలా సమయమే పట్టింది. వివిధ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమె చివరకు ‘గబ్బర్ సింగ్’తో తొలి సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకుంది. అయితే ఆ తర్వాత పలు విజయాలు ఆమెను వరించాయి. ఇదిలా ఉంటే… నటన ప్రదర్శించడానికి మాధ్యమాల పట్టింపు లేదని భావించే శ్రుతీహాసన్ కొంతకాలం క్రితమే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి…