మిథున్ చక్రవర్తి, శృతి హాసన్, అర్జన్ బజ్వా, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సోనలీ కులకర్ణి కీలక పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బెస్ట్ సెల్లర్’. నిర్మాతలు మంగళవారం అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంటెలిజెంట్, గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ముకుల్ అభ్యంకర్ దర్శకత్వం వహించిన ‘బెస్ట్ సెల్లర్’ ఫిబ్రవరి 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ను సిద్ధార్థ్ మల్హోత్రా ఆల్కెమీ ప్రొడక్షన్ ఎల్ఎల్పి బ్యానర్ పై నిర్మించారు. ఎనిమిదవ ఎపిసోడ్ వరకు సిరీస్‌లోని సస్పెన్స్‌తో కూడిన ప్రతి నిమిషాన్ని ప్రేక్షకులు ఇష్టపడతారని డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ‘పిట్ట కథలు’తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టిన నటి శృతి హాసన్ ఇప్పుడు ‘బెస్ట్ సెల్లర్’తో హిందీ వెబ్ సిరీస్ రంగంలోకి అడుగు పెట్టింది.
Read Also : బాలయ్య షో రికార్డ్స్ ‘అన్‌స్టాపబుల్’
ట్రైలర్ విషయానికొస్తే… నటుడు అర్జన్ బజ్వా (అర్జాబ్ తాహిర్ వజీర్) ప్రసిద్ధ నవలా రచయిత అయినప్పటికీ చేతన్ భగత్ లాగా మారాలని కోరుకుంటాడు. అభిమాని అయిన మీటూ మాధుర్ (శృతి)ని కలుస్తాడు. తాహిర్ తన తదుపరి నవల కోసం ఒక ఆలోచన కోసం వెతుకుతున్నప్పుడు, మీటూ చేతులపై ఉన్న మచ్చలను గమనించి ఒక నవలని అభివృద్ధి చేస్తాడు. అయితే ఆ తరువాత కథలో జరిగిన అనూహ్యమైన మార్పులు, మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ థ్రిల్లర్ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.