Acharya Devobhava Sarvepalli Radhakrishnan: మాతృదేవోభవ… పితృదేవోభవ …ఆచార్యదేవోభవ..తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అన్నారు పెద్దలు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. గురు అంటే చీకటిని తొలగించు అని అర్ధం. విద్యార్థి అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. గురు అంటే దానిని రుచ్యము చేసేది, అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది అన్నమాట. మన దేశంలో పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ.. ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండదు.…