Bengaluru Water Crisis: భారత సిలికాన్ వ్యాలీ, టెక్ హబ్ బెంగళూర్ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సరిపడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. రుతుపవనాలు వస్తేనే నగర నీటి కష్టాలు తీరుతాయని నిపుణులు, ప్రజలు చెబుతున్నారు. అయితే, వర్షాకాలానికి 4 నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.
చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో, వార్తాపత్రికల్లో, కవితల్లో చదువుతున్న నీటి సంక్షోభం మెల్లమెల్లగా రెక్కలు విప్పుతోంది. ప్రపంచం మొత్తం నీటి కరువుతో పోరాడుతోంది.
Bengaluru water crisis: బెంగళూర్ నగరంలో నీటి కొరత తీవ్రమవుతోంది. ఇప్పటికే ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నీటి ట్యాంకర్ల పేరుతో దోపిడి చేసేవారిపై ఉక్కుపాదం మోపడంతో పాటు నీటి వృథాను అరికట్టేందుకు జరిమానాలను విధిస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పలు గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే నివాసితులు మాత్రం నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగిన నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరులోని అన్ని ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోరుబావి కూడా ఎండిపోయిందన్నారు
సిలికాన్ సిటీ బెంగళూర్ వేసవి కాలం పూర్తిగా రాకముందే తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని పలు ప్రాంతాలు నీటి కొరతను చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని డ్రై ప్లేసెస్‌కి నీటిని సరఫరా కోసం ప్రైవేట్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రోజూవారీ నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడే ప్రైవేట్ అపార్ట్మెంట్ల సమస్యను మరింత తీవ్రతరం చేసింది. కనకపురా రోడ్‌లోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ నీటి…